ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో ముగిసిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌

ABN, First Publish Date - 2021-03-14T21:56:11+05:30

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పలు పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. భారీ బ్యాలెట్‌తో ఓటింగ్‌కు ఎక్కువ సమయం తీసుకుంటోందని ఓటర్లు చెబుతున్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌; హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాలకు ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. రెండు నియోజకవర్గాల పరిధిలో 10 లక్షలకుపైగా ఓటర్లున్నారు. 1,530 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక, కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు చేశారు. మరి కొన్నిచోట్ల సూక్ష్మ పరిశీలకులను నియమించారు. ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ నియోజకవర్గానికి 34/23 అంగుళాలు, నల్లగొండ నియోజకవర్గానికి 25/18 అంగుళాల పరిమాణంలో జంబో బ్యాలెట్‌ పత్రాలను ముద్రించారు. అంటే, దాదాపు దినపత్రిక బ్రాడ్‌షీట్‌ పరిమాణంలో ఉంటుంది. 

Updated Date - 2021-03-14T21:56:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising