ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌ తమిళిసైను కలిసిన ఐఐఎస్‌ ట్రెయినీ అధికారులు

ABN, First Publish Date - 2021-10-17T22:23:43+05:30

ది ఇండియన్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సర్వీసెస్‌ (ఐఐఎస్‌) ట్రెయినీ అధికారులు ఆదివారం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ది ఇండియన్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సర్వీసెస్‌ (ఐఐఎస్‌) ట్రెయినీ అధికారులు ఆదివారం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌ఇన్‌ఫర్‌మేషన్‌ బ్యూరో(పిఐబి)కి వారు అటాచ్‌అయిన నేపధ్యంలో వారు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మినిస్ర్టీ ఆఫ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌  ఆధ్వర్యంలో పనిచేసే పిఐబి అధికారులకు గవర్నర్‌ తమిళిసై అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో ఇండియన్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సర్వీసెస్‌నుతమ కేరీర్‌గా ఎంచుకోవడం పట్ల వారిని ప్రశంసించారు.


క్షేత్ర స్థాయిలో ప్రాంతీయ భాషపట్ల సరైన కమ్యూనికేషన్‌ కలిగి వుండడం ఎంతో ముఖ్యమని అన్నారు. తన అనుభవంలోని కొన్ని తమిళ అంశాలను ఆమె వివరించారు. కమ్యూనికేషన్‌ ప్రాముఖ్యతను వివరించారు. యువ అధికారులు అంకిత భావంతో పనిచేస్తూ సమాచార రంగంలో మరింత నైపుణ్యాన్ని సాధించాలని సూచించారు. 

Updated Date - 2021-10-17T22:23:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising