ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యోగా భారతీయ సంస్కృతిలో భాగం- గవర్నర్‌

ABN, First Publish Date - 2021-06-20T22:49:56+05:30

యోగా అన్నది భారతీయ సంస్కృతిలో భాగమని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. పురాతనకాలం నుంచే మన దేశంలో యోగా ఆరోగ్యసూత్రంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: యోగా అన్నది భారతీయ సంస్కృతిలో భాగమని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు.  పురాతనకాలం నుంచే మన దేశంలో యోగా ఆరోగ్యసూత్రంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సందేశాన్నిచ్చారు. భారత దేశంలో పుట్టిన యోగా ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించిందన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందన్నారు. 


ప్రతి రోజూ యోగా చేయడం వల్ల మనసు, శరీరం మన నియంత్రణలో ఉంటుందని అన్నారు. ప్రతి నిత్యం యోగా ఆచరించడం వల్ల మానసిక, శారీరక, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో బలోపేతం అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. కోవిడ్‌-19 నేపద్యంలో యోగా ఆచరించడం వల్ల ఇమ్యూనిటీ పెంచుకునేందుకు  అవకాశం ఉండడంతో చాలా మంది యోగా పట్ల ఆసక్తి చూపిస్తున్నారని గవర్నర్‌ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ యోగాను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చారని గవర్నర్‌ అన్నారు. యోగా డే సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలుతెలిపారు. 

Updated Date - 2021-06-20T22:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising