ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజూరాబాద్‌లో ఇంటెలిజెన్స్‌కు అంతుబట్టని తీర్పు వస్తుంది

ABN, First Publish Date - 2021-07-26T08:21:06+05:30

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఇంటెలిజెన్స్‌ పోలీసులకు అంతుబట్టని తీర్పు వస్తుందని ఆర్టీసీ మాజీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకా్‌షరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈటల రాజేందర్‌కే నా నైతిక మద్దతు: గోనె ప్రకాష్‌రావు

హుజూరాబాద్‌, జూలై 25: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఇంటెలిజెన్స్‌ పోలీసులకు అంతుబట్టని తీర్పు వస్తుందని ఆర్టీసీ మాజీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకా్‌షరావు అన్నారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్‌ను ఓడించేందుకేసీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారన్నారు. భూకబ్జా ఆరోపణలు నిజమైతే ప్రభుత్వానికి అప్పగిస్తానని ఈటల ప్రకటించినప్పటికీ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయడం సిగ్గు చేటన్నారు. నిర్మల్‌లో చెరువులను ఓ మంత్రి కబ్జా చేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలన్నీ జలమయమయ్యాయని అన్నారు. ఆ మంత్రిపై సీఎం కేసీఆర్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ నుంచి ఈటల 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అవినీతి లేకుండా అభివృద్ధికి పాటుపడ్డారని చెప్పారు. ఇలాంటి రాజకీయ నాయకుడిని నియోజకవర్గ ప్రజలు కాపాడుకోవాలని సూచించారు. తన నైతిక మద్దతు ఈటలకే ఉంటుందని గోనె ప్రకా్‌షరావు ప్రకటించారు.

Updated Date - 2021-07-26T08:21:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising