ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన గవర్నర్

ABN, First Publish Date - 2021-12-08T23:52:32+05:30

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ఎలా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు రాష్ట గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ఎలా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు రాష్ట గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె రెండు ముఖ్యమైన కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడ పలువురు రైతులతో ముచ్చటించారు. దుప్పల పల్లి, అర్జాల బావి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతున్న కేంద్రాలకు వెళ్లిన గవర్నర్ అక్కడ కొనుగోలు విధానం, కొనుగోళ్లతీరు, అక్కడ రైతులకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. 


ఈ సందర్భంగా గవర్నర్ రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం తరపున సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ వారిని అడిగారు. అలాగే పంట ఎంత వచ్చింది, ధాన్యాన్ని నింపడానికి అవసరమైన బ్యాగుల లభ్యత గురించి అడిగారు.ఈ సందర్భంగా అధికారులు కొనుగోలుకేంద్రాల తీరుపై గవర్నర్కు వివరించారు. సేకరణ విధానం, సౌకర్యాల కల్పన వంటి వాటిని వివరించారు. అంతకు ముందు గవర్నర్ నల్గొండ జిల్లా షేర్ బంగ్లా ప్రాంతంలో భక్తాంజనేయ సహిత సంతోషిమాతా దేవాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Updated Date - 2021-12-08T23:52:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising