ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొర్రెలకాపరులను అప్పులపాలు చేసిన సీఎం

ABN, First Publish Date - 2021-09-16T05:16:53+05:30

గొర్రెలకాపరులను అప్పులపాలు చేసిన సీఎం

జిల్లా నలుమూలల నుంచి ర్యాలీగా వస్తున్న పెంపకందారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీఎంపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవి

ఐనవోలు, సెప్టెంబరు 15: ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొర్రెలకాపరులను కోటీశ్వరులుగా చేస్తానని అప్పులపాలు చేశారని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం(జీఎంపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్‌ విమర్శించారు. ఐనవోలులో జీఎంపీఎస్‌ జిల్లా ద్వితీయ మహాసభ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారు ఐనవోలు దేవస్థానం నుంచి రైతు వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహాసభకు అధ్యక్ష వర్గంగా శాతబోయిన రమేష్‌, గంటె సమ్మయ్య, వెల్పుల రమే్‌షలు వ్యవహరించారు. ముఖ్య అతిథిగా పాల్గొని రవీందర్‌ మాట్లాడారు. ప్రభుత్వం రెండో విడత గొర్రెల యూనిట్లను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. 

అతిథులుగా పాల్గొన్న ప్రొఫెసర్లు ఆర్‌.శ్రీకాంత్‌, గడ్డం కృష్ణ, కురుమ సంఘం జిల్లా కార్యదర్శి మ జ్జిగ జయపాల్‌, యాదవ సంఘం మండల అధ్యక్షు డు రాజారపు రాజులు మాట్లాడుతూ.. నిరుద్యోగుల ఉపాధి కోసం రూ.35లక్షలతో 75 శాతం సబ్సిడీతో రుణాలు అందించాలన్నారు. పశువైద్య పోస్టులను భర్తీ చేయాలని, మృతి చెందిన గొర్రెల కాపరులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, గొర్రెలు, మేకలకు ఇన్సూరెన్స్‌ చేయాలని కోరారు. ఐనవోలు దేవస్థానం చైర్మన్‌ పదవిని గొల్లకురుమలకు ఇవ్వాలన్నారు. సర్పంచ్‌లు బండి పర్వతాలు, రజిత, కార్పొరేటర్‌ మా మిండ్ల రాజు, ఎంపీటీసీ రవి మాట్లాడారు. రమేష్‌, మధుకర్‌, మల్లేశం, సమ్మయ్య, రవి, సాంబయ్య, చేరాలు, నల్లబెట్ట రాజు, కొంరయ్య, కుమారస్వామి, లింగయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-09-16T05:16:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising