ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టులెట్ బోర్డుల ఏర్పాటుపై జీహెచ్ఎంసీ క్లారిటీ..

ABN, First Publish Date - 2021-08-25T19:45:52+05:30

హైదరాబాద్‌: టులెట్ బోర్డుల ఏర్పాటుపై జీహెచ్ఎంసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగతంగా తమ తమ ఇళ్ల వద్ద ఏర్పాటు చేసుకునే టులెట్ బోర్డులపై ఎలాంటి జరిమానాలూ ఉండవని స్పష్టం చేశారు. అయితే అనుమతి లేకుండా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సొంత ఇళ్ల వద్ద టులెట్ బోర్డులు పెట్టుకోవచ్చు..

బహిరంగ ప్రదేశాల్లోని ప్రకటనలపైనే జరిమానా

అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే చర్యలు: విశ్వజిత్


హైదరాబాద్‌: టులెట్ బోర్డుల ఏర్పాటుపై జీహెచ్ఎంసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగతంగా తమ తమ ఇళ్ల వద్ద ఏర్పాటు చేసుకునే టులెట్ బోర్డులపై ఎలాంటి జరిమానాలూ ఉండవని స్పష్టం చేశారు. అయితే అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే అన్ని రకాల పోస్టర్లపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈవీడీఎం కింద సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో బహిరంగ ప్రదేశాల్లోని అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు, వాల్ రైటింగ్ తదితరాలపై అధికారులు బుధవారం జరిమానా విధించారు. 


ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ మీడియాతో మాట్లాడారు. సొంత ఇంటికి టులెట్ బోర్డు పెట్టినా.. జరిమానా అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. వ్యక్తిగతంగా ఇళ్ల వద్ద ఉన్న టులెట్ బోర్డులపై జరిమానా విధిస్తే.. తమ దృష్టికి తేవాలని ఆయన సూచించారు. అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఎలంటి పోస్టర్లను అంటించరాదని చెప్పారు. నగరంలో అనధికార బ్యానర్లు తదితరాల ఏర్పాటుపై జనిమానా విధించినట్లు తెలిపారు.

Updated Date - 2021-08-25T19:45:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising