ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి జీహెచ్‌ఎంసీ చర్యలు శూన్యం

ABN, First Publish Date - 2021-04-10T21:49:38+05:30

కరోనా కట్టడికి జీహెచ్‌ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కమిషనర్, మేయర్ ఒక్క సమీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా కట్టడికి జీహెచ్‌ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కమిషనర్, మేయర్ ఒక్క సమీక్ష కూడా చేయలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గ్రేటర్ పరిధిలో నాలుగు వందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. గ్రేటర్ పరిధిలో కరోనా బాధితులు కిట్స్ అందక ఇబ్బందులు పడుతున్నారు. మైక్రో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు ఇప్పటివరకు స్పష్టత లేదు. జీహెచ్‌ఎంసీ, వైద్య శాఖల మధ్య సమన్వయం లేక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి చెబుతున్నారు.


గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా విపరీతమైన స్పీడ్‌తో విస్తరిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్లుగా సుమారు 2500 మంది వరకు చికిత్స పొందుతున్నారు. పాజిటివ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ఓ పక్క కరోనా పరీక్షల కోసం తరలివస్తున్న ప్రజలు.. మరో పక్క వ్యాక్సిన్‌ కోసం వెళ్తున్న వారు.. ఆస్పత్రులకు ఒక్కసారిగా పెరిగిన వైరస్‌ రోగుల తాకిడి.. వీటన్నింటితో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కరోనా ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని ఎలా కాటేస్తుందో అన్న భయం క్రమంగా పెరుగుతోంది. 

Updated Date - 2021-04-10T21:49:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising