ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

90 కిలోల ఎండు గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-03-07T05:07:20+05:30

90 కిలోల ఎండు గంజాయి పట్టివేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగ్గురిని అదుపులోకి తీసుకున్న హసన్‌పర్తి పోలీసులు 


పోచమ్మమైదాన్‌, మార్చి 6 : నగరంలోని ఆరెపల్లి-దామెర క్రాస్‌వద్ద 90కిలోల ఎండు గంజాయిని పట్టుకొని, దాన్ని తరలిస్తున్న వారిని హసన్‌పర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హసన్‌పర్తి సీఐ కె.శ్రీధర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... ఆరెపల్లి-దామెర క్రాస్‌ వద్ద శనివారం సాయంత్రం విశ్వసనీయ సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా భూపాలపల్లి నుంచి ములుగు రోడ్డు వైపు వస్తున్న ఓ వాహనం నుంచి ముగ్గురు వ్యక్తులు పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. వారి నుంచి సుమారు రూ.9 లక్షలు విలువ చేసే 90 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. భూపాలపల్లి జిల్లా కాసింపల్లికి చెందిన చిక్క గోపి, చిట్యాల మండలం రామచంద్రాపూర్‌కు చెందిన క్యాతం అనిల్‌, చిట్యాల మండలం అందుకు తండాకు చెందిన వాహన డ్రైవర్‌ ఉయ్యాల నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే వీరితో పాటు ఉన్న నిమ్మల దశరథం అనే వ్యక్తి పారిపోయాడని, అతడి వద్ద సుమారు 30 కిలోల గంజాయి ఉన్నట్లు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

Updated Date - 2021-03-07T05:07:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising