ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా ఆవేదనను షెకావత్‌ అర్థం చేసుకోవాలి: హరీష్‌రావు

ABN, First Publish Date - 2021-11-12T21:47:01+05:30

తమ ఆవేదనను కేంద్రమంత్రి షెకావత్‌ అర్థం చేసుకోవాలని మంత్రి హరీష్‌రావు కోరారు. విభజన హామీలను అమలు చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తమ ఆవేదనను కేంద్రమంత్రి షెకావత్‌ అర్థం చేసుకోవాలని మంత్రి హరీష్‌రావు కోరారు. విభజన హామీలను అమలు చేయాలని షెకావత్‌ను కోరుతున్నామన్నారు. షెకావత్‌తో తమకు వ్యక్తిగతంగా గొడవలు లేవని, ఏడేళ్లుగా కేంద్రం నుంచి సహకారం అందడం లేదన్నది సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. తెలంగాణ నీటి వాటానే తాము కోరుతున్నామని తెలిపారు. నీటి వాటాపై గతంలోనే కేంద్రానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోకపోవడం వాస్తవం కాదా? హరీష్‌రావు అని ప్రశ్నించారు.  


ఏపీ, తెలంగాణ మధ్య జలాల పంపిణీపై కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటులో జరిగిన జాప్యానికి సీఎం కేసీఆరే కారణమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. 2015లోనే సుప్రీం కోర్టులో కేసు వేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తుందని ఆయన నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాలూ తమ ప్రాజెక్టులను కృష్ణ, గోదావరి బోర్డులకు అప్పగించకపోతే రాజ్యాంగ నిబంధనలున్నాయని షెకావత్ హెచ్చరించారు. 

Updated Date - 2021-11-12T21:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising