ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

ABN, First Publish Date - 2021-08-28T08:36:52+05:30

జగిత్యాల జిల్లాలో తొమ్మిదేళ్ల క్రితం జరిగిన రైతు హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదుతోపాటు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జరిమానా విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలా 20 వేల చొప్పున జరిమానా.. జగిత్యాల కోర్టు తీర్పు

జగిత్యాల టౌన్‌, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలో తొమ్మిదేళ్ల క్రితం జరిగిన రైతు హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదుతోపాటు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జరిమానా విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది. జగిత్యాల కోర్టు రెండో అదనపు న్యాయమూర్తి సుదర్శన్‌ శుక్రవారం ఈమేరకు తీర్పు వెలువరించారు. పెగడపల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామానికి చెందిన తిరుమణి మోహన్‌రెడ్డికి, రాచకొండ గంగారెడ్డికి మధ్య పాత కక్షలు ఉన్నాయి. దీనిని మనసులో పెట్టుకుని రాచకొండ గంగారెడ్డి, బొడిగె నర్సయ్య, రాచకొండ అంజిరెడ్డి, పన్నాల మహేశ్‌, తిరుమణి నరసింహారెడ్డి కలిసి  2012 మే 7న పొలం నుంచి ఇంటికి వస్తున్న మోహన్‌రెడ్డిని సుద్దపల్లి గ్రామ శివారులో హత్య చేశారు.  అప్పటి డీఎస్పీ, ప్రస్తుత అడిషనల్‌ ఎస్పీ మహేందర్‌ కేసు నమోదు చేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి.. నేరం రుజువు కావడంతో నలుగురికి జీవిత ఖైదు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. మరో నిందితుడు రాచకొండ అంజిరెడ్డి విచారణ కాలంలో మృతి చెందాడు. 

Updated Date - 2021-08-28T08:36:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising