ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18 ఏళ్లు ఉద్యమంలో వాడుకున్నారు

ABN, First Publish Date - 2021-10-24T08:05:40+05:30

సీఎం కేసీఆర్‌ 18 సంవత్సరాలు తనను ఉద్యమంలో వాడుకొని, తెలంగాణ వచ్చిన తర్వాత బయటకు పంపించారని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఉద్యమకారులను పక్కనపెట్టి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ బయటకు పంపించారు: ఈటల
  • కేసీఆర్‌ మెడలు వంచి ధాన్యం కొనిపిస్తాం: సంజయ్‌ 


జమ్మికుంట/ఎల్కతుర్తి/హుజూరాబాద్‌, అక్టోబరు 23: సీఎం కేసీఆర్‌ 18 సంవత్సరాలు తనను ఉద్యమంలో వాడుకొని, తెలంగాణ వచ్చిన తర్వాత బయటకు పంపించారని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఉద్యమకారులను పక్కనపెట్టి ఇతర పార్టీల వారిని తీసుకొచ్చి మంత్రులను చేశారని, దీనికి కేసీఆర్‌ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. శనివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలంలోని సింగాపూర్‌, తుమ్మనపల్లి గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. అధికారంలో ఉండి కూడా చేయలేని అనేక పనులు రాజీనామా చేసిన తర్వాత చేయగలిగానని, అందుకు గర్వపడుతున్నానని చెప్పారు. ఎవరి జాగాలో వారికి ఇల్లు కట్టించడమే 30వ తేదీ తర్వాత తన పని అని చెప్పారు. ఫామ్‌హౌ్‌సలో పొగపెట్టి కేసీఆర్‌ను బయటకి రప్పించే పని ఉందని.. కేసీఆర్‌, ఆయన బానిసల వెంట పడతానని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత సిద్దిపేటకు వస్తానని, అక్కడ ఎవరి సత్తా ఏందనేది తేల్చుకుందామని అన్నారు. 80 రోజులవుతున్నా దళితబంధు ఇవ్వలేని వారు.. ఆరు రోజుల్లో ఇస్తామని అంటున్నారని చెప్పారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత 31న దళిత బంధు డబ్బులు ఇవ్వకపోతే టీఆర్‌ఎ్‌సపై పోరాటం చేస్తానని ప్రకటించారు. ‘సీఎం కేసీఆర్‌ మెడలు వంచి ధాన్యం కొనిపించే బాధ్యత మాది.


రాష్ట్రంలో పండే ప్రతి గింజనూ కొనుగోలు చేసేది కేంద్రమే, కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం ఉండదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మునిసిపల్‌ పరిధిలోని కొత్తపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ఫాంహౌస్‌ పాలన పోవాలని, ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని శ్రీరాములపల్లి, అంబాల, గూడూరు, కానిపర్తి, శంభునిపల్లిల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్‌లో చార్జ్‌షీట్‌ ఆన్‌ కేసీఆర్‌ పత్రాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆవిష్కరించారు. 

Updated Date - 2021-10-24T08:05:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising