ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డ మరో మాజీ ఐపీఎస్

ABN, First Publish Date - 2021-08-23T22:17:28+05:30

ఈయన కూడా ప్రవీణ్ కుమార్ ‌లాగే ప్రభుత్వంతో విబేధించి స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్నారు. అయితే వీఆర్ఎస్ తీసుకున్న అనంతరమే ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చారు. కాగా వీకే సింగ్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటనను ప్రకటించడంతో ఆయన కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే అనుమానాలు లేవనెత్తుతున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఐపీఎస్ అధికారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన ప్రగతి ఏమీ లేదని, అయితే అవినీతిలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా అవతరించిందని మాజీ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తాను త్వరలోనే బయట పెడతానని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు.


సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ‘‘తెలంగాణ కోసం కేసీఆర్ చేసింది ఏమీ లేదు. ఏదైనా చేశారంటే రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ అవినీతి రాష్ట్రంగా మార్చారు. 7 ఏళ్ల కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను 7 నెలల్లో ప్రజలకు చూపిస్తాను. సర్కార్ వైఫల్యాలు బయట పెట్టేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సద్భావన యాత్ర చేస్తాను. ‘జన సేవ సంఘ్’ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో రాజకీయేతర ఉద్యమం కొనసాగిస్తాను’’ అని వీకే సింగ్ అన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌ని ఉద్దేశిస్తూ కేసీఆర్ ప్రభుత్వంలో పని చేయడం ఇష్టం లేకనే బ్యూరోక్రాట్స్ వీఆర్ఎస్ తీసుకుంటున్నారని అన్నారు.


గతంలో జైళ్ల శాఖ డీజీగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రభుత్వంపై వీకే సింగ్ విమర్శలు గుప్పించారు. జైళ్లలో ఎక్కువ శాతం మంది ఎలాంటి నేరాలు చేయని బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉన్నారని వీకే సింగ్ విమర్శించారు. ఈయన కూడా ప్రవీణ్ కుమార్ ‌లాగే ప్రభుత్వంతో విబేధించి స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్నారు. అయితే వీఆర్ఎస్ తీసుకున్న అనంతరమే ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చారు. కాగా వీకే సింగ్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటనను ప్రకటించడంతో ఆయన కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఈయన కూడా ప్రవీణ్ కుమార్ లాగే బీఎస్పీలో చేరతారా అనే ప్రశ్నలు కూడా రేకెత్తుతున్నాయి.

Updated Date - 2021-08-23T22:17:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising