ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంగరలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌

ABN, First Publish Date - 2021-10-22T05:10:48+05:30

వంగరలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌

అధికారులతో మాట్లాడుతున్న వంగర రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

 114 ఎకరాల్లో భూ సేకరణ

భీమదేవరపల్లి, అక్టోబరు 21:  మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు స్వగ్రామమైన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గు రువారం జీవో జారీ చేసింది. ఇందుకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ (టీఎ్‌సఐఐసీ) హనుమకొండ జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు 595 సర్వే నంబర్‌లో వంగరలో 114 ఎకరాల భూసేకరణను ఇప్పటికే చేపట్టారు. హనుమకొండ జిల్లాలో ధర్మసాగర్‌, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో ఫుడ్‌ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన జరిపారు. అందులో వంగరలోని భూమి చదునుగా ఉండి పరిశ్రమలకు అనుకూలంగా ఉం టుందని, అధికారులు నివేదిక సమర్పించారు. పీవీ నర్సింహారావు శతజయంతి సందర్భంగా వంగరలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తే ఆయనకు నివాళి అర్పించినట్లు అవుతుందని, ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌, జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో వీరి నివేదికను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్ర భుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ను వంగరలో ఏర్పాటు చేసేందుకు సు ముఖత వ్యక్తం చేస్తూ జీవో జారీ చేసింది. 

భూ సేకరణ

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం భూ సేకరణకు సర్వే శాఖ డి ప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ సారంగపాణితో పాటు పలువురు సర్వేయేర్లు, సి బ్బంది, భీమదేవరపల్లి తహసీల్దార్‌ పోలం ఉమారాణిలు సర్వే జరిపేందుకు గురువారం వంగరకు వచ్చారు. అధికారులు భూములు కొ లిచేందుకు వస్తున్నారని తెలిసి వంగర గ్రామస్థులు కొలతలు వేస్తు న్న అధికారులతో మాట్లాడారు. తాము కోల్పోతున్న భూములకు బ దులు మరోచోట భూములు ఇవ్వాలని, అలాగే తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ ఉమారాణి మాట్లాడుతూ.. భూములు నష్టపోయిన రైతులకు మెరుగైన పరిహారం ఇవ్వడంతో పాటు ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2021-10-22T05:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising