ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిమాయత్‌సాగర్‌కు తగ్గిన వరద ఉధృతి

ABN, First Publish Date - 2021-10-18T20:53:04+05:30

జంటజలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌కు వదర ఉధృతి తగ్గింది. గత కొన్నిరోజులుగా పరీవాహక ప్రాంతాల్లోకురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు వచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: జంటజలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌కు వదర ఉధృతి తగ్గింది. గత కొన్నిరోజులుగా పరీవాహక ప్రాంతాల్లోకురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు వచ్చింది. దీంతో హైదరాబాద్‌ మెట్రోవాటర్‌బోర్డు అధికారులు గేట్లను తెరిచి నీటిని మూసీలోకి విడదల చేశారు. ప్రస్తుతం మూడు గేట్లను మూసి వేసినట్టు అధికారులు తెలిపారు. ఒక గేటు మాత్రమే 2 అడుగుల మేరకు తెరిచి నీటిని వదులుతున్నట్టు తెలిపారు.హిమాయత్‌ సాగర్‌పూర్తి స్థాయి నీటి మట్టం 1,763.50 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1,763.45 అడుగుల మేరకు ఉందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 2.97 టీఎంసీలుకాగా ప్రస్తుతం 2.94 టీఎంసీలుఉన్నట్టు తెలిపారు. 


అలాగే జంటజలాశయాల్లో మరొకటి ఉస్మాన్‌ సాగర్‌ సైతం నిండు కుండలా మారింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం నిండుగా వుంది. దీంతో ప్రాజెక్టు నాలుగు గేట్లను రెండు ఫీట్ల మేరకు ఎత్తి నీటిని వదులుతున్నారు. ఈ రెండు జలాశయాల నుంచి వరద నీటిని వదులుతుండడంతో మూసీలో వరద ప్రవాహం ఎక్కువగా వుంది. నదీ పరసరాల్లో నివసించే బస్తీలు, మురికివాడల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 

Updated Date - 2021-10-18T20:53:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising