హన్మకొండ సుధానగర్లో అగ్నిప్రమాదం
ABN, First Publish Date - 2021-04-01T13:15:45+05:30
హన్మకొండలోని సుధానగర్లో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఇంట్లో ఉన్న
వరంగల్ : హన్మకొండలోని సుధానగర్లో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు పరుగులు పెట్టారు. అక్కడున్న స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అదించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదంతో ఇంట్లో ఉన్న సామాగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్దం అయ్యాయని ఇంటి యజమాని తెలిపారు.
Updated Date - 2021-04-01T13:15:45+05:30 IST