ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్లాదుర్గంలో జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో

ABN, First Publish Date - 2021-12-01T09:38:46+05:30

ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై రైతులు కన్నెర్ర చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌
  • ధాన్యం రోడ్డుపై పారబోసి నిప్పు పెట్టిన రైతులు
  • తక్షణం ధాన్యం కొనుగోలుకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం 


అల్లాదుర్గం, నవంబరు 30: ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై రైతులు కన్నెర్ర చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి  ధాన్యాన్ని తరలించి రోజులు గడుస్తున్నా ఏవో సాకులు చెబుతూ కొనుగోలు చేయడంలేదని  మెదక్‌ జిల్లాలోని అల్లాదుర్గం రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ శివారులోని 161వ జాతీయ రహదారిపైకి ర్యాలీగా వెళ్లి  అక్కడ బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పు పెట్టారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని రైతులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ సమస్యలు పరిష్కారం అయితేనే ఆందోళన విరమిస్తామని రోడ్డుపై భీష్మించుకుకూర్చున్నారు. ఆ సమయంలో నారాయణఖేడ్‌ నుంచి సంగారెడ్డి వైపు వెళుతున్న  మంత్రి హరీశ్‌రావు  ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.  మంత్రి కాన్వాయ్‌ని రైతులు అడ్డుకున్నారు. కారు దిగివచ్చి మంత్రి.. రైతులతో మాట్లాడారు. గత 20 రోజులుగా తాము పడుతున్న ఇబ్బందులను వారు మంత్రితో మొరపెట్టుకున్నారు. పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో స్థానికంగా ఈ నెల 8న ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తరలించి, ఆరబోసి 10 రోజులు గడిచినా,  వాటిని కొనుగోలు చేయలేదని చెప్పారు. ఆందోళన చెందవద్దని, ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని మంత్రి రైతులకు హామీ ఇచ్చారు. తక్షణం స్పందించి జిల్లా అధికారులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.


జగిత్యాల జిల్లాలో.. 

రాయికల్‌: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని, తక్షణమే వడ్లు కొనుగోలు చేయాలని జగిత్యాల జిల్లాలో రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. మండలంలోని రాయికల్‌ రామాజీపేట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. అకాల వర్షానికి ధాన్యానికి మొలకలు వచ్చాయని, ప్రభుత్వం వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసి, మిల్లులకు తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

Updated Date - 2021-12-01T09:38:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising