ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ వివాదంతో ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-01-24T05:09:30+05:30

భూ వివాదంతో ఆత్మహత్యాయత్నం

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఒకే కుటుంబానికి చెందిన దళిత రైతులు తగరం ఎల్లయ్య, తగరం వీరేష్‌, తగరం శిల్పా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పురుగుల మందు తాగిన ముగ్గురు దళిత రైతులు

తమ భూమిలో దారి తీస్తున్నారని ఆందోళన

సీరోలులో ఘటన.. జిల్లా ఆస్పత్రికి తరలింపు


కురవి, జనవరి 23 : మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సీరోలు భూవివాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దళిత రైతులు తగరం ఎల్లయ్య, తగరం వీరేష్‌, తగరం శిల్ప శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీస్‌, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఆ ముగ్గురిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అధికారులు, బాధితుల కుటుంబసభ్యుల వివరాల ప్రకారం..

సీరోలులోని 123 సర్వే నంబర్‌లో దళిత కుటుంబానికి చెందిన అన్నదమ్ములైన తగరం ఎల్లయ్య, తగరం వీరేష్‌, తగరం జంగయ్యలకు 30 గుంటల వ్యవసాయ భూమి ఉంది. వీరి భూమికి అవతల శ్యామల వెంకటేశ్వర్లు, వెంక న్న, రాజు, సుధాకర్‌, రాములుతోపాటు మరో ఇద్దరు రైతులకు సంబంధించి వ్యవసాయ పొలా లు ఉన్నాయి. వీరి పొలాలకు పోవాలంటే దళిత రైతుల వ్యవసాయ భూమి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే తమ పొలాల మీదుగా రాకపోకలు సాగించవద్దని, పక్కనున్న ఎస్సారెస్పీ కాలువ దారిని వాడుకోమని దళిత రైతులు సూచిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే దళిత రైతులకు ఇతర రైతులకు మఽధ్య రాకపోకల దారి భూవివాదం నడుస్తోంది. కాగా, ఆ పొలం నుంచి రాకపోకలకు దారి ఇవ్వాలంటూ కురవి రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు ఏడుగురు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు కురవి ఆర్‌ఐ జంపయ్య, వీఆర్వో ఏకలవ్య, పోలీస్‌ సిబ్బంది శనివారం సాయంత్రం వివాదాస్పద స్థలానికి చేరుకున్నారు. అదేసమయంలో దారికావాలని డిమాండ్‌ చేస్తున్న రైతులు జేసీబీ యంత్రంతో పొలం వ ద్దకు చేరుకున్నారు. దీంతో తమ పొలం నుంచి దారి తీస్తారని ఆందోళనకు గురైన దళిత రైతు లు తగరం ఎల్లయ్య, తగరం వీరేష్‌, తగరం జంగయ్య భార్య శిల్ప.. తమవద్ద ఉన్న పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పోలీస్‌, రెవెన్యూ అధికారులు ఆ ముగ్గురిని సకాలంలో మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, దళిత రైతులను ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు దర్శనం రామకృష్ణ, అంబేద్కర్‌ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కామ సంజీవరావు, బీఎస్పీ నాయకులు దార్ల శివరాజ్‌ ఆస్పత్రిలో వారిని పరామర్శించారు. దళిత రైతుల ఆత్మహత్యాయత్నానికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-01-24T05:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising