ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిర్చి పంట నష్టపోయి రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-12-30T18:16:37+05:30

మిర్చి పంటకు తెగులు వచ్చి పూర్తిగా నష్టపోవడంతో మనస్థాపం చెంది కేసముద్రం మండలం కేసముద్రం విలేజికి చెందిన భూక్య బాలు(43) క్రిమిసంహారక మందు తాగి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేసముద్రం, డిసెంబరు 29 : మిర్చి పంటకు తెగులు వచ్చి పూర్తిగా నష్టపోవడంతో మనస్థాపం చెంది కేసముద్రం మండలం కేసముద్రం విలేజికి చెందిన భూక్య బాలు(43) క్రిమిసంహారక మందు తాగి బు ధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమే్‌షబా బు తెలిపిన ప్రకారం.. బేరువాడ శివారు తెల్లబండతండాకు చెందిన బాలు 30 ఏళ్ల క్రితం కేసముద్రం విలేజికి వచ్చి స్థానికంగా హమాలీ పనిచేస్తూ జీవిస్తున్నాడు. తెల్లబండా తండాలో తనకున్న 30 గుంటల చెల్క లో మిర్చి సాగు చేస్తున్నాడు. అయితే మిర్చికి తెగులు సోకి పూర్తిగా నష్టపోయాడు. మిర్చి పంటపై పెట్టిన పెట్టుబడి అంతా వృథా కావడంతోపాటు గతంలో చేసిన అప్పులు రూ.5లక్షల వరకు ఉండడంతో తట్టుకోలేక మంగళవారం అర్ధరాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. అదేరాత్రి మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి ఆయన్ను తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య భద్ర మ్మ, ఇద్దరు కుమారులున్నారు. భద్రమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై రమే్‌షబాబు తెలిపారు.

Updated Date - 2021-12-30T18:16:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising