ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచిర్యాలలో నకిలీ ఐఏఎస్‌

ABN, First Publish Date - 2021-04-13T08:43:58+05:30

తాను ఐఏఎ్‌సనని చెప్పుకోవడమేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ జూపి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడిన ఉదంతం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కలెక్టర్‌ పేరుతో నిరుద్యోగులకు వల
  • రూ.కోటి మేర టోకరా
  • పోలీసుల అదుపులో నిందితుడు?

మంచిర్యాల, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): తాను ఐఏఎ్‌సనని చెప్పుకోవడమేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ జూపి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడిన ఉదంతం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం రేకులపల్లె గ్రామానికి చెందిన బర్ల లక్ష్మీనారాయణ (21) దాదాపు ఐదు నెలల క్రితం జిల్లా కేంద్రంలోని పాత  మంచిర్యాల సమీపంలో ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్‌లోని కృతిక కంట్రి అపార్ట్‌మెంటులో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. తాను ఐఏఎస్‌ అధికారినని చెప్పుకోవడమేకాకుండా కలెక్టర్‌ పేరుతో నేమ్‌ ప్లేట్‌ కూడా తయారు చేయించాడు. మంచిర్యాల జిల్లా  రెబ్బెనపల్లికి చెందిన మహేందర్‌ను  పీఏగా నియమించుకున్నాడు. అతని సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేశారు. 30 మంది యువతీయువకుల నుంచి రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు మొత్తంగా దాదాపు రూ.కోటి మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే డబ్బులిచ్చిన వారు ఉద్యోగాలు రాకపోయే సరికి ఆదివారం లక్ష్మీనారాయణ ఉండే ఫ్లాట్‌కు వచ్చి గొడవ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. నకిలీ ఐఏఎస్‌ వలలో పడ్డవారిలో జగిత్యాల జిల్లాకు చెందినవారే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.  

Updated Date - 2021-04-13T08:43:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising