ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలి

ABN, First Publish Date - 2021-01-18T08:42:44+05:30

రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2019లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య డిమాండ్‌

31న హన్మకొండలో మూడు లక్షల మందితో మహాగర్జన 


బర్కత్‌పుర/హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2019లో తెచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను ఇంతవరకూ రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో అగ్రవర్ణ పేదలు నష్టపోతున్నారని సంఘం వాపోయింది. సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, గౌరవ అధ్యక్షుడు రాంరెడ్డి, ఈడబ్ల్యూఎస్‌ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు మల్లాది పవన్‌, రాష్ట్ర వైశ్య సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు శ్రీనివాస్‌, రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల సేవా సమాఖ్య అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్‌శర్మ, రాష్ట్ర కమ్మ సంఘాల ప్రధాన కార్యదర్శి రామకృష్ణప్రసాద్‌, వెలమ సంఘాల జేఏసీ రాష్ట్ట్ర కన్వీనర్‌ వి.పాపారావు తదితరులు మాట్లాడారు.


రాష్ట్రంలో ఈడబ్ల్యూఎ్‌సను అమలు చేయకపోవడంతో విద్య, ఉద్యోగ రంగాల్లో అగ్రవర్ణ పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని వారు పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 31న హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో మూడు లక్షల మందితో ఓసీల మహాగర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మహాగర్జన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాజకీయాలకు అతీతంగా ఓసీలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 


కేసీఆర్‌కు బీవోపీడబ్ల్యూఏ లేఖ

అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయాలని బ్రాహ్మణ అధికారులు, వృత్తిదారుల సంక్షేమ సంఘం(బీవోపీడబ్ల్యూఏ) కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంఘం లేఖ రాసింది. గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు ఈడబ్ల్యూఎ్‌సను అమలు చేస్తున్నాయని, కాబట్టి రాష్ట్రంలోనూ అమలుపరచాలని సంఘం విజ్ఞప్తి చేసింది. కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాలతో పాటు విద్యా రంగంలోనూ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అగ్రవర్ణ పేదలకు కల్పించాలని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాధాకృష్ణమూర్తి, సుధాకర్‌ కోరారు.

Updated Date - 2021-01-18T08:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising