ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి: అసదుద్దీన్ ఓవైసీ

ABN, First Publish Date - 2021-03-02T01:29:02+05:30

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎంఐఎం అసదుద్దీన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్  తీసుకోవాలని ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. దారుస్సలాంలోని మజ్లీస్ పార్టీ కార్యాలయంలో ఓవైసీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకుని తమను తాము కాపాడుకోవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదే అని ఆయన అన్నారు. పేద మధ్య తరగతి కుటుంబాలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా వాక్సిన్‌ని తక్కువ ధరకే అందుబాటులో ఉండే విధంగా మోడీ చూడాలని ఆయన పేర్కొన్నారు. తాను కూడా కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకుంటానని ఓవైసీ ప్రకటించారు.


కోవిడ్ కష్టకాలంలో ఫ్రంట్‌లైన్‌లో ఉండి కృషి చేసిన ప్రతి ఒక్క జర్నలిస్టుకు వ్యాక్సిన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు వ్యాక్సిన్ వేసే విషయాన్ని పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. 


 కోవిడ్ వాక్సిన్‌పై ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయని ఓవైసీ తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 64  సంవత్సరాల వయసు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఏం కాదని అంటున్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటపుడు 64 సంవత్సరాలు పైబడిన వారు వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదేనా, కాదా అనేదానిపై క్లారిటీ ఇవ్వాలని  కేంద్రానికి ఆయన సూచించారు. 

Updated Date - 2021-03-02T01:29:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising