ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌లో ఈటల రాజేందర్‌ దుమారం

ABN, First Publish Date - 2021-05-01T01:02:58+05:30

టీఆర్‌ఎస్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ దుమారం రేపుతున్నారు. ఈటల రాజేందర్‌పై కబ్జా ఆరోపణలున్నాయనే ప్రచారం జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ దుమారం రేపుతున్నారు. ఈటల రాజేందర్‌పై కబ్జా ఆరోపణలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈటలపై వేటుకు రంగం సిద్ధమైందని టీఆర్‌ఎస్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. కబ్జా ఆరోపణలపై కాసేపట్లో ఈటల వివరణ ఇవ్వనున్నారు. తనపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారంటుని ఆయన వాపోయారు. ఇటీవల ఈటల చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌లో కలకలం రేగుతోంది. కిరాయిదారులం కాదు.. పార్టీకి ఓనర్లమంటూ ఇటీవల ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించి టీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు సృష్టించారు. 


మంత్రి ఈటల గత కొంతకాలంగా పార్టీ నిర్వహించే కీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో సీఎం కేఆర్ నిర్వహించే మంత్రివర్గ సమావేశానికి కూడా ఈటలకు ఆహ్వానం లేకుండాపోయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో.. ఆయా నియోజకవర్గాలతో సంబంధం లేనప్పటికీ ఇతర జిల్లాలకు చెందిన నేతలను ప్రచారానికి తీసుకువచ్చారు. కానీ ఈటల సేవలను ఎక్కడా వినియోగించుకోవడంలేదు. ముఖ్యంగా సీఎం సమావేశానికి కూడా ఈటలకు ఆహ్వానం రావడంలేదు. ఇటీవల కాలంలో ఈటల వ్యాఖ్యలను చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీలో ఆయన ఇమడలేకపోతున్నారనేది తెలుస్తోంది. ఎప్పుడో ఒకప్పుడు తిరుగుబాటు బావుట ఎగురవేసే అవకాశం ఉందనే సంకేతాలు ఆయన స్పష్టంగా ఇస్తున్నారు. 

Updated Date - 2021-05-01T01:02:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising