ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ అహంకారాన్ని పాతరేశారు: ఈటల రాజేందర్

ABN, First Publish Date - 2021-11-03T02:14:36+05:30

హుజూరాబాద్ గెలుపుపై ఈటల రాజేందర్ స్పందించారు. డబ్బు, మద్యం, ప్రభుత్వ దౌర్జన్యాన్ని, కేసీఆర్ అహంకారాన్ని తెలంగాణ ప్రజలు పాతరేశారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: హుజూరాబాద్ గెలుపుపై ఈటల రాజేందర్ స్పందించారు. డబ్బు, మద్యం, ప్రభుత్వ దౌర్జన్యాన్ని, కేసీఆర్ అహంకారాన్ని హుజురాబాద్ ప్రజలు పాతరేశారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబాన్ని టీఆర్ఎస్ వేధించినా ప్రజలు తన వైపు నిలిచారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులను సైతం టీఆర్ఎస్ బెదిరించిందని తెలిపారు. ఎన్నికల అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎన్నికల నిబంధనలు పట్టించుకోలేదని మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి డబ్బులు పంపిణీ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేస్తామని ఈటల పేర్కొన్నారు. నియోజకవర్గంలో శ్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వచ్చిందన్నారు. రాబోయే కాలంలో ఇలాంటి సంప్రదాయం ఉండకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎన్నికలు దేశ చరిత్రలో ఇవేనని ఈటల తెలిపారు. ‘‘ఇంత వేదన, అక్రమాలు, దుర్మాగాలు జరుగుతున్నా ఎక్కడో లోపం జరిగింది. ఈ గెలుపు కేసీఆర్‌కు చెంపపెట్టు. కులాయుధాన్ని వాడే ప్రయత్నం చేశారు. డబ్బు సంచులు వెదజల్లినా హుజూరాబాద్ ప్రజలు నా వెంటే నడిచారు. నన్ను ఆదరించిన హుజూరాబాద్ ప్రజలకు రుణపడి ఉంటా.’’ అని ఈటల అన్నారు. 



‘‘తెలంగాణలో  దోపిడీ రాజ్యం కొనసాగుతోంది. దళిత బంధు హుజురాబాద్‌లో అందరికి అమలు చేయాలి. తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలి. పేదరికంలో ఉన్న వారందరికీ బంధు లాంటి పథకం ఇవ్వాలి. డబుల్ బెడ్‌రూమ్‌లు సొంత స్థలాల్లో ఇల్లు కట్టివ్వాలి. నీళ్లు నిధులు నియామకాలు టాగ్ లైన్‌తో తెలంగాణ వచ్చింది. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి. నిరుద్యోగ భృతి ఇవ్వాలి. పింఛన్లు అందరికి ఇవ్వాలి. రైతాంగం పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. సమస్యలపై అందరితో కలిసి పోరాటం చేస్తాం. రాబోయే కాలంలో ఉద్యమ బిడ్డగా ఉంటా.’’ అని ఈటల వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-11-03T02:14:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising