ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈఎస్‌ఐ స్కామ్‌... వెలుగులోకి కొత్త కోణాలు

ABN, First Publish Date - 2021-04-11T23:09:08+05:30

ఈఎస్‌ఐ స్కామ్‌... వెలుగులోకి కొత్త కోణాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఈఎస్‌ఐ స్కామ్‌లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బినామీ పేర్లతో ముకుందా రెడ్డి  వ్యాపారాలు చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ప్రమోద్‌రెడ్డి, వినయ్‌రెడ్డి పేర్ల మీద వ్యాపారాలు ముకుందరెడ్డి చేశారని, డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా మెడికల్ పరికరాలు కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. తక్కువ ధరకు దొరికే పరికరాలని కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి అధిక ధరలు రాబట్టారు. దేవికారాణి,  ముకుంద రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి బాబులు కలిసి స్కాంకు పాల్పడినట్లు ఈడి నిర్ధారించింది. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులను పెద్దమొత్తంలో మళ్లించినట్లుగా నిర్ధారించారు. అలాగే పలు ఫార్మా కంపెనీల తోపాటుగా రియల్ ఎస్టేట్ వెంచర్‌లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. దేవికారాణి ఏకంగాగా తమిళనాడు కర్ణాటక ఆంధ్రలో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారని, పిఎంజె జ్యూవెలరీలో పెద్ద మొత్తంలో ఆమె నగలు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఆస్తుల తోపాటు నగల కొనుగోలు మొత్తం కూడా హవాలా ద్వారా చెల్లింపు జరిగినట్లుగా గుర్తించారు. 

Updated Date - 2021-04-11T23:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising