ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుపేదలందరికీ డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు

ABN, First Publish Date - 2021-10-17T05:14:12+05:30

నిరుపేదలందరికీ డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు

లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు అందజేస్తున్న మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ధర్మారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆత్మకూరు, అక్టోబరు 16 : నిరుపేదలందరికీ డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు అందించి వారి కలలను నేరవేర్చడమే ప్రభుత్వం లక్ష్యమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.  హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్‌ గ్రామంలో శుక్రవారం దసరా కనుగా 52మంది లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు చేశారు.  అనంతరం సర్పంచ్‌ శ్రీలత అధ్యక్షతన కేటాయింపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇంటి స్థలం ఉంటే డబుల్‌బెడ్‌రూమ్‌ ఇల్లు కేటాయిస్తామన్నారు. పరకాల నియోజకవర్గానికి 2వేల గృహాలు కేటాయించారని, అందులో 600  పూర్తయ్యాయని, మిగతావి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. అలాగే కటాక్షపురం, హౌజుబుజుర్గు గ్రామాలకు సిమెంట్‌ రోడ్లకు నిధులు కేటాయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ..  నియోజకవర్గానికి 2వేల గృహాలు కేటాయించినా ప్రభుత్వ స్థలాలు లేక పూర్తికాలేదని తెలిపారు. ఇంటి స్థలం ఉంటే తప్పనిసరి డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు కేటాయిస్తామన్నారు.  గూడెప్పాడ్‌ గ్రామంలో మొదటి విడతగా 52 గృహాలు కేటాయించామని, మిగతా 40 గృహాలకు తర్వాతలో అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణానికి కృషి చేసిన మాజీ వైస్‌ ఎంపీపీ, కాంట్రాక్టర్‌ జనగాం సాంబయ్యను మంత్రి, ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కక్కెర్ల రాధిక, ఎంపీపీ మార్క సుమలత, స్థానిక సర్పంచ్‌ బీరం శ్రీలత, ఉపసర్పంచ్‌ వీసం శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీ బీరం రజనీకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-10-17T05:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising