ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ కాంట్రాక్టర్ల లైసెన్స్ రేనివల్ గడువు పెంచాలి

ABN, First Publish Date - 2021-09-12T22:58:50+05:30

విద్యుత్ కాంట్రాక్టర్ల లైసెన్స్ రేనివల్ గడువు కాలం మూడు నుండి ఐదు సంవత్సరాలకు పొడిగించాలని తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్టర్ల లైసెన్స్ రేనివల్ గడువు కాలం మూడు నుండి ఐదు సంవత్సరాలకు పొడిగించాలని తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు. అసోసియేషన్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి యస్ కె మాజిద్,ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వతాలు,నాగర్కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి తిరుపతి రెడ్డి తదితరులు మంత్రిని కలసిన వారిలో ఉన్నారు.ఈ సందర్భంగా అసోసియేషన్ మంత్రికి వినతిపత్రాన్ని అందజేస్తూ తెలంగాణా ఏర్పడ్డాకే మొట్టమొదటి సారిగా లైసెన్స్ రేనివల్ గడువును రెండు నుండి మూడు సంవత్సరాలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. 


అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మీకు మా అసోసియేషన్ ఋణపడి ఉంటుందని పేర్కొన్నారు. అంతే గాకుండా మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ తదుపరి కాలంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమలులోకి తెచ్చిందని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అదే విదంగా మూడు నుండి ఐదు సంవత్సరాలకు లైసెన్స్ రేనివల్ గడువును పెంచ గలిగితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్లకు ఒకింత వెసులుబాటు కలుగుతుందని వారు మంత్రిని కోరారు.అందుకు తక్షణం లైసెన్స్ బోర్డుకు లైసెన్స్ రేనివల్ గడువు పెంచుతూ సిఫార్స్ చేయాలని వారు మంత్రి జగదీష్ రెడ్డికి విజ్ణప్తి చేశారు.

Updated Date - 2021-09-12T22:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising