ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-10-09T00:47:18+05:30

హుజూరాబాద్‌లో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌లో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలిసి బీజేపీ నేత ఈటల రాజేందర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికార దుర్వినియోగం, ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలు ఇంతకు ముందు చూడలేదన్నారు. తాను తన కుటంబం మాత్రమే ఉండాలని, తమను ఎవరూ ప్రశ్నించకూడదనే దుర్మార్గ ఆలోచన సీఎం కేసీఆర్‌దని దుయ్యబట్టారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగానికి ప్రతిష్ట తెచ్చేలా హుజూరాబాద్‌ ఓటు ఉండాలని కోరారు. నీతి నిజాయితీతో, ఆత్మాభిమానంతో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఈటల రాజేందర్‌ అని కొనియాడారు. ఈటల రాజీనామాతో కేసీఆర్‌ కుటుంబ పీఠాలు కదులుతున్నాయని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2021-10-09T00:47:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising