ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ ఎన్నికల సందడి?

ABN, First Publish Date - 2021-06-25T09:06:28+05:30

తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌ శాసనసభ, ఆరు ఎమ్మెల్సీలకు ఆగస్టు, సెప్టెంబరులలో ఎన్నికలు 

నవంబరులో మరికొన్ని ఎమ్మెల్సీలకు.. కరోనా తగ్గితేనే షెడ్యూల్‌


హైదరాబాద్‌, జూన్‌  24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. కరోనా ప్రభావం దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతుండడంతో రాష్ట్రంలో ఇప్పటికే ఖాళీగా ఉన్న ఒక శాసనసభ, ఆరు శాసన మండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించే విషయమై భారత ఎన్నికల సంఘం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నదని విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో లాక్‌ డౌన్‌ ను కూడా పూర్తిగా ఎత్తివేయడంతో జరగాల్సిన ఎన్నికలను త్వరలో నిర్వహించవచ్చని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో హుజూరాబాద్‌ శాసనసభా స్థానం ఖాళీగా ఉంది. ఈటల రాజేందర్‌ రాజీనామా చేయడంతో జూన్‌ రెండో వారంలో ఈ సీటు ఖాళీ అయ్యింది. దీనికి ఆర్నెల్లలోగా ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చు. శాసన సభ్యుల కోటాలో ఆరు శాసన మండలి సభ్యుల స్థానాలు కూడా జూన్‌  3వ తేదీనే ఖాళీ అయ్యాయి. సహజంగా శాసన మండలి స్థానాలను ఖాళీ కావడానికి  ముందే ఎన్నికలు నిర్వహిస్తారు. సిట్టింగ్‌ అభ్యర్థులు పదవీ విరమణ చేసిన మరుసటి రోజు నుంచే కొత్తగా ఎన్నికైన వారి పదవీకాలం అమలులోకి వస్తుంది. 


ఏప్రిల్‌, మే నెలల్లో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగానూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను ఈసీ వాయిదా వేసింది. పరిస్థితులు కుదుటపడినట్లు కనిపిస్తున్నందున... హుజూరాబాద్‌ శాసనసభా స్థానంతో పాటు ఆరు శాసన మండలి స్థానాలకు కూడా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఎన్నికలు జరపవచ్చని తెలుస్తోంది. శాసనసమండలి ఎన్నికల్లో ఓటర్లు ఎమ్మెల్యేలు మాత్రమే కావడంతో కరోనా జాగ్రత్తల విషయంలో పెద్ద సమస్య లేదు. హుజూరాబాద్‌లో మాత్రం కనీసం లక్షన్నర మంది ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు వస్తారు. ఇటీవల ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ సహా ప్రచారంలో పాల్గొన్న నేతలకు, ఓటర్లకు, పోలింగ్‌ సిబ్బందికి పెద్ద ఎత్తున కరోనా వచ్చింది. మరణాలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఆ నియోజకవర్గంలోని ప్రజలందరికీ ముందుగా వ్యాక్సిన్‌ వేయాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే చోట కనీసం 80 శాతం మంది వయోజనులకు టీకాలు వేయాలనే ప్రతిపాదన ఉంది. కరోనా తగ్గుముఖం పడితే ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన శాసన మండలి సభ్యుల పదవీకాలం డిసెంబరు నాటికి పూర్తి కానున్నందున వాటికి నవంబరులో ఎన్నికలు జరగాలి. కరోనా ప్రభావం తగ్గితే రాష్ట్రంలో ఏడాది చివరి వరకు వరుసగా ఎన్నికలు ఉంటాయని భావిస్తున్నారు. 

Updated Date - 2021-06-25T09:06:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising