ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రగతి భవన్‌’ అదిరేలా దెబ్బ కొట్టాలి..

ABN, First Publish Date - 2021-07-27T05:03:29+05:30

‘ప్రగతి భవన్‌’ అదిరేలా దెబ్బ కొట్టాలి..

దేశరాజుపల్లిలో మాట్లాడుతున్న ఈటల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

8వ రోజుకు చేరిన ప్రజాదీవెన పాదయాత్ర 


కమలాపూర్‌, జూలై 26 : హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు తమ ఓట్లతో ఇక్కడ దెబ్బకొడితే ప్రగతి భవన్‌లో కదలికలు వస్తాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రజాదీవెన పాదయాత్రలో భాగంగా 8వ రోజు సోమవారం  మాజీ మంత్రి ఈటల మండలంలోని కమలాపూర్‌, శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజుపల్లి, ఉప్పల్‌, ఉప్పలపల్లి గ్రామాల్లో పర్యటించారు. సీఎం కేసీఆర్‌ ఓట్లకు భయపడతాడని, హుజూరాబాద్‌లో తాను గెలిచిన తర్వాత తెలంగాణలో ఒక విప్లవం వస్తుందన్నారు.   తన రాజీనామాతో పింఛన్లు, తెల్లరేషన్‌కార్డులు, గొర్రెలు వస్తున్నాయని, ఎన్నికల్లో తాను గెలిస్తే ఇంకా చాలా వస్తాయన్నారు. తాను ఎప్పుడూ గడ్డిపోచలా కాకుండా  గడ్డపారలా ఉన్నానన్నారు.  పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు  పద్మ, రాంచందర్‌రావు, తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.  పాదయాత్రకు వచ్చిన ఈటల రాజేందర్‌కు అన్ని గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది. మహిళలు మంగళహారుతులు, బోనాలతో స్వాగతం పలికారు. ఘనంగా సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉప్పల్‌లో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా   కానిపర్తి గ్రామంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రామప్పకు అంతర్జాతీయ స్థాయిలో యునేస్కో వారసత్వ సంపదగా గుర్తింపు రావడంపై బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, తుల ఉమ, మిథున్‌రెడ్డి, అశోక్‌రెడ్డి ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-07-27T05:03:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising