ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్ బినామీల పై కఠిన చర్యలే: పౌరసఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటీ

ABN, First Publish Date - 2021-03-03T20:10:04+05:30

ప్రజా పంపిణీ ని బినామీ లకు అప్పగించి ,రేషన్ విధానాన్ని ప్రహసనం చేయాలని చూసే కొందరు తమ దురాలోచనకు సైతం స్వస్తి పలకాలని లేకపోతే తగిన శిక్ష తప్పదని పౌరసరఫరాల శాఖ నారాయణ పేట జిల్లా ఎన్ఫోర్స్ మెంట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట: ప్రజా పంపిణీ ని బినామీ లకు అప్పగించి ,రేషన్ విధానాన్ని  ప్రహసనం చేయాలని చూసే కొందరు తమ దురాలోచనకు సైతం స్వస్తి పలకాలని లేకపోతే తగిన శిక్ష తప్పదని పౌరసరఫరాల శాఖ నారాయణ పేట జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్  మాచన రఘునందన్ హెచ్చరించారు. పట్టణ కేంద్రం లో ఉన్న పలు చౌక దుకాణాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొన్ని రేషన్ షాపులు అధీకృత డీలర్ల కు బదులు బినామీల చేతుల్లో ఉన్నాయి. దీని పై  ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో  తనిఖీలు చేపట్టారు.


ఈ సందర్భంగా మాచన రఘునందన్ మాట్లాడుతూ ఒక వేళ ఆ ఫిర్యాదుల్లో నిజం ఉంటే, సంబంధం లేని వ్యక్తి షాపు నడిపిస్తే , సదరు అనధికార వ్యక్తులు బినామీ వ్యక్తులు గా పరిగణింపబడే అవకాశం ఉందన్నారు.అలాంటి వారి అరెస్టు కు సైతం వెనకాడేది లేదని హెచ్చరించారు. రేషన్ బినమీలను ఏరి పారేసే దాకా విశ్రాంతి తీసుకునే ప్రశ్నే లేదని అన్నారు. ప్రజా పంపిణీ అనేది ప్రతిష్టాత్మక మైన జాతీయ ఉత్పత్తి పథకం అని ఈ వ్యవస్థలో ఉన్న అధీకృత డీలర్ల కు ప్రజా సేవ చేస్తున్న  భాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు. కొందరు డీలర్లు మాత్రం ఇంతటి భాధ్యత ను తేలిగ్గా తీసుకుంటున్నరని అన్నారు. రేషన్ షాపు నిర్వహణ ఇతరుల చేతికి అప్పజెప్పి  బినామీ అన్న పేరు వచ్చేలా  యదేచ్చగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.


చౌక దుకాణాల ను బినామీలు నడిపితే బేడీలు ఖాయమని ,అనధికార వ్యక్తులు రేషన్ దుకాణాల ను నడపటం  చట్ట రీత్యా నేరం అని స్పష్టం చేశారు. రేషన్ షాపుల్లో సరకు వివరాలను, సక్రమంగా నమోదు చెయ్యటమే గాక దుకాణాలను కేవలం డీలర్లు, వారి కుటుంబంలోని అనుమతి పొందిన వ్యక్తులు మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఒక వేళ రేషన్ దుకాణాల ను నిర్వహించడం తమ వల్ల కాకపోతే, కారణాలను అధికారులకు తెలియజేసి నియమ నిబంధనల ప్రకారం దుకాణం నిర్వహణ ఉండేలా జాగ్రత్త పడాలి అని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దుకాణం బోర్డులను షాపు బయట ప్రదర్శించాలనీ ఆదేశించారు.

Updated Date - 2021-03-03T20:10:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising