ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోటి శుభ్రతతో కరోనా కట్టడి

ABN, First Publish Date - 2021-04-23T09:57:45+05:30

సాధారణ నోటి సంరక్షణ చర్యలతో నోటి నుంచి ఊపిరితిత్తుల్లోకి కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నోరు అపరిశుభ్రంగా ఉంటే కొవిడ్‌ ముప్పు ఎక్కువ

డాక్టర్‌ వికాస్‌ గౌడ వెల్లడి


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22: సాధారణ నోటి సంరక్షణ చర్యలతో నోటి నుంచి ఊపిరితిత్తుల్లోకి కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైందని డాక్టర్‌ గౌడ్‌ డెంటల్‌లో పరిశోధక బృందం చీఫ్‌ డాక్టర్‌ వికాస్‌ గౌడ్‌ తెలిపారు. ఎప్పటికపుడు నోటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే కరోనా తీవ్రతను కట్టడి చేయవచ్చని గత ఎనిమిది నెలల్లో జరిగిన పరిశోధనలను పరిశీలిస్తే అర్థమవుతుందని ఆయన చెప్పారు. నోరు శుభ్రంగా లేకపోవడం, చిగుళ్లవాపు వంటివి కరోనా ముప్పును పెంచుతాయని ఆ పరిశోధనల్లో తేలిందని పేర్కొన్నారు.


కరోనా వైర్‌సను బలహీనపర్చడంలో మౌత్‌వా్‌ష వంటి ఉత్పత్తులు అత్యంత సమర్థంగా పనిచేసినట్లు ఆ పరిశోధనల్లో వెల్లడైందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ చిగుళ్ల వ్యాధులతో బాధపడేవారు సహా ఆరునెలలకోసారి డెంటిస్ట్‌ వద్ద పళ్లను శుభ్రం చేయించుకోవాలని, నోటి ఆరోగ్యాన్ని తనిఖీ చేయించుకోవాలని ఆయన సూచించారు. 70 నుంచి 90 శాతం కొవిడ్‌ ఇన్ఫెక్షన్లు నోటి ద్వారా సంభవించినవేనని ఆయన చెప్పారు.

Updated Date - 2021-04-23T09:57:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising