ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధైర్యపడొద్దు.. అండగా ఉంటా

ABN, First Publish Date - 2021-03-01T09:32:20+05:30

దా‘రుణ’ యాప్‌ వేధింపులు భరించలేక అఘాయిత్యం చేసుకున్న చంద్రమోహన్‌ కుటుంబానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దా‘రుణ’ యాప్‌ బాధిత కుటుంబానికి కవిత భరోసా

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): దా‘రుణ’ యాప్‌ వేధింపులు భరించలేక అఘాయిత్యం చేసుకున్న చంద్రమోహన్‌ కుటుంబానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. మృతుడి భార్య సరితకు ఉద్యోగంతో పాటు ముగ్గురు ఆడపిల్లలకు ఉద్యోగం వచ్చేంత వరకు చదివిస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో చంద్రమోహన్‌ భార్య, ముగ్గురు పిల్లలు ఆదివారం కవితను కలిశారు. సరితను ఓదార్చిన కవిత అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్‌.. దా‘రుణ’ యాప్‌ వేధింపులు తట్టుకోలేక జనవరిలో ఆత్మహత్య చేసుకున్నారు. తీసుకున్న రుణం కన్నా ఆరు రెట్లు చెల్లించాలని నిర్వాహకులు పదే పదే ఫోన్లు చేసి వేధింస్తుడటంతో బలవనర్మణానికి పాల్పడ్డారు. కుటుంబ పెద్ద మరణించడంతో.. చంద్రమోహన్‌ భార్య సరిత, ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత.. చంద్రమోహన్‌ కుటుంబానికి బాసటగా నిలిచారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని భరోసానిచ్చారు. దీంతో కవితకు చంద్రమోహన్‌ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2021-03-01T09:32:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising