ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం సభకు కరోనా నిబంధనలు వర్తించవా?

ABN, First Publish Date - 2021-04-15T09:13:42+05:30

కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటూ పాఠశాలలను మూసివేసిన అధికారులు.. సాగర్‌లో సీఎం కేసీఆర్‌ సభకు ఎలా అనుమతిచ్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రశ్నిస్తే కేసులు పెడతారా?: భట్టి

మధిరటౌన్‌, ఏప్రిల్‌ 14: కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటూ పాఠశాలలను మూసివేసిన అధికారులు.. సాగర్‌లో సీఎం కేసీఆర్‌ సభకు ఎలా అనుమతిచ్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా మధిరలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో బుధవారం అంబేడ్కర్‌ జయంతి నిర్వహించారు. అనంతరం భట్టి విలేకరులతో మాట్లాడుతూ శరవేగంగా కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయంపై ఉన్న శ్రద్ధ.. ప్రజల ప్రాణాలపై లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో తక్షణమే 144 సెక్షన్‌ విధించి, కరోనా వ్యాప్తిని అరికట్టాలని కోరారు. సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే కేసులు పెడతారా? అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం బలంగా ఉండాలన్నదే అంబేడ్కర్‌ సిద్ధాంతమని, దురదృష్టం కొద్దీ నేటి పాలకులు దాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు. కాగా, మధిరలో ఏర్పాటు చేసిన 11 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి భట్టి ఆవిష్కరించారు.

Updated Date - 2021-04-15T09:13:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising