ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

176 ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్స: డీఎంహెచ్‌వో

ABN, First Publish Date - 2021-04-16T05:42:40+05:30

176 ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్స: డీఎంహెచ్‌వో

మాట్లాడుతున్న ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ అర్బన్‌, ఏప్రిల్‌ 15: జిల్లాలో ప్రస్తుతం కొవిడ్‌ చికిత్స అందిస్తున్న 14 ప్రైవేట్‌ ఆస్పత్రులతో పాటు 5పడకలు అంతకన్నా ఎక్కువ ఉన్న 176 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతిచ్చిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లలితాదేవి తెలిపారు. గురువారం వరంగల్‌లోని ఐఎంఏ హాలులో తానా ఐఎంఏ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, ఎంజీఎం ఆధ్వర్యంలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు కొవిడ్‌ ట్రీట్‌మెంట్‌ ప్రొటోకాల్‌ శిక్షణ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో లలితాదేవి మాట్లాడారు. ప్రస్తుతం ఎంజీఎంలో 440 పడకలు, ప్రైవేట్‌ ఆస్పత్రులలో 395 పడకలు ఉండగా, ఇప్పుడు 6,060 పడకలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చికిత్స అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. కరోనా రాకుండా ప్రతీఒక్కరు జాగ్రత్తలు పాటించాలని, కరోనా లక్షణాలున్న వారు వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తానా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ ప్రవీణ్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ మదన్‌మోహన్‌, డాక్టర్‌ పవన్‌, డాక్టర్‌ సునీత, డాక్టర్‌ మల్లికార్జున్‌, మాస్‌ మీడియా అధికారి అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-16T05:42:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising