ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

“గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష”ను విజయవంతం చేద్దాం: డీ.కే.అరుణ

ABN, First Publish Date - 2021-05-18T19:22:20+05:30

దేశంలో కరోనా కట్టడికి కేంద్రం అహర్నిశలు శ్రమిస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే.అరుణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశంలో కరోనా కట్టడికి కేంద్రం అహర్నిశలు శ్రమిస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే.అరుణ అన్నారు. మంగళవారం అరుణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలు అడిగిందే తడవుగా ఎలాంటి సాయం చేయడానికైనా కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. కరోనా కేసులు, మరణాలు విషయంలో తెలంగాణ తప్పుడు లెక్కలు చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా  ఈ విషయంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆక్సీజన్, రెమ్‌డెసివిర్, వెంటిలేటర్లను భారీగా అందజేసిందన్నారు. పేదలకు కొవిడ్ చికిత్స భారం నుంచి రూ.5 లక్షల వరకు  అందించే ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు.రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చాలన్న డిమాండ్‌తో రేపు జరిగే “గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష”ను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఎవరింట్లో వాళ్లు కొవిడ్, లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి దీక్ష చేయాలని తెలిపారు. మీడియా, సోషల్ మీడియా, వర్చువల్ మీడియా ద్వారా దీక్షను విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామని  డీ.కే.అరుణ పేర్కొన్నారు.

Updated Date - 2021-05-18T19:22:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising