ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సజ్జనార్‌పై ప్రశ్నల వర్షం కురిపించిన దిశ కమిషన్

ABN, First Publish Date - 2021-10-12T21:22:36+05:30

దిశ కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన హైపవర్ కమిషన్ ముందు విచారణకు సజ్జనార్ హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: దిశ కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన హైపవర్ కమిషన్ ముందు విచారణకు సజ్జనార్ హాజరయ్యారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ సమయంలో ఆయన సైబరాబాద్ సీపీగా ఉన్న విషయం తెలిసిందే. దిశ కమిషన్ సజ్జనార్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. 

ప్రశ్న: ఎన్‌కౌంటర్ జరిగిన విషయం మీకు ఏ సమయానికి తెలిసింది?

జవాబు: గత ఏడాది డిసెంబర్ 6న ఉదయం 6.20 నిమిషాలకు ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు తెలిసింది.

ప్రశ్న: ఎన్‌కౌంటర్‌పై ఎఫ్ఐర్ నమోదు ఎంక్వైరీ చేశారా?

జవాబు: శంషాబాద్ డీసీపీకి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పారు.

ప్రశ్న: ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇంచార్జ్ ఆఫీసర్ ఎవరు?

జవాబు: షాద్‌నగర్ సీఐ శ్రీధర్ ఇంచార్జీ అని చెప్పారు.

ప్రశ్న: ఎన్‌కౌంటర్ స్పాట్‌కి రీచ్ అయ్యాక ఎవరెవరిని కలిశారు?

జవాబు: ఏసీపీ సురేందర్‌ను కలిశా, పోస్టుమార్టం గురించి డీఎంఈకి సమాచారం అందించానన్నారు.

ప్రశ్న: ఇంక్వేస్ట్‌ను ఎవరి సమక్షంలో చేశారు? 

జవాబు: తెలంగాణలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు ఇంక్వేస్ట్ చేస్తారు.

ప్రశ్న: ఇంక్వేస్ట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు చేయమని ఎవరు చెప్పారు?

జవాబు: మా లీగల్ అడ్వైజర్ బాలా బుచ్చయ్య అని చెప్పారు.

ప్రశ్న: సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌కు వెళ్లేటప్పుడు పోలీసులతో ఆయుధాలు ఉన్నాయా? ఎంత మంది పోలీసులు వెపన్స్ క్యారీ చేశారు? 

జవాబు: పోలీసుల నుంచి నిందితులు వెపన్స్ లాక్కున్నారని తెలిపారు.

ప్రశ్న: వెపన్స్ ఎందుకు అన్‌లాక్ చేశారు?

జవాబు: వెపన్స్ అన్‌లాక్ చేయలేదన్నారు.

ప్రశ్న: వెపన్స్ రికవరీ కాకుండా, పోస్ట్‌మార్టం పూర్తి కాకుండా ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టారు?

జవాబు: శంషాబాద్ డీసీపీ పెట్టమంటే ప్రెస్‌మీట్ పెట్టామన్నారు.

ప్రశ్న: 2008 వరంగల్‌లో ఎన్‌కౌంటర్, 2016లో నక్సలైట్ల ఎన్‌కౌంటర్, 2019 దిశ కేసు ఎన్‌కౌంటర్లలో ఒకే రకమైన విధానం కనిపిస్తోంది? 

జవాబు: వరంగల్ ఎన్‌కౌంటర్ సమయంలో నేను ఎస్పీగా ఉన్నా, 2016లో నేను లా అండ్ ఆర్డర్‌లో లేనని తెలిపారు.

Updated Date - 2021-10-12T21:22:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising