పకడ్బందీగా ‘ధరణి’ అమలు
ABN, First Publish Date - 2021-10-30T05:07:06+05:30
పకడ్బందీగా ‘ధరణి’ అమలు
కలెక్టర్ బి.గోపి
వరంగల్ కలెక్టరేట్, అక్టోబరు 29: జిల్లాలో ధరణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలవుతోందని కలెక్టర్ బి.గోపి అన్నారు. ధరణి పోర్టల్ ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం తహసీల్దార్లు, ఆర్‌డీవోలు ధరణి సెక్షన్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ కేక్ కట్ చేసి మాట్లాడుతూ.. ఽధరణి ప్రారంభంతో రిజిస్ర్టేషన్ సేవలు ప్రజల వద్దకే చేరాయని, గతంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు మాత్రమే రిజిస్ర్టేషన్లు జరిగేవని ఇప్పుడు ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నాయన్నారు. వ్యవసాయ సంబంధిత భూ రిజిస్ట్రేషన్లు నిమిషాల్లో పూర్తి చేస్తున్నారన్నారు. జిల్లాలో 31 మ్యాడుల్స్ ద్వారా జరిగిన లావాదేవీలు 16,752 ఉన్నాయని, ఇందులో విక్రయాలు 7,874, గిఫ్ట్ డీడీ 3,520, వారసత్వం 1,075, తనఖా 1,798, పరిష్కరించబడిన ఫిర్యాదులు 8,540, పెండింగ్ మ్యూటేషన్లు 2,689, భూమికి సంబంధించిన విషయాలపై అందిన ఫిర్యాదులు 3495, నిషేధించబడిన జాబితా 841, కోర్టు కేసులు సమాచారం 299 ఉన్నాయని తెలిపారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.హరిసింగ్, ఆర్‌డీవోలు మహేందర్‌జీ, పవన్‌కుమార్, ఏవో రాజేంద్రనాథ్, జిల్లాలోని తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T05:07:06+05:30 IST