ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేత్తడి హారికకు షాకిచ్చిన టూరిజం డిపార్ట్‌మెంట్

ABN, First Publish Date - 2021-03-09T20:50:57+05:30

తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ దేత్తడి హారిక(అలేఖ్య హారిక)కు ఆ డిపార్ట్‌మెంట్ షాకిచ్చింది. ఆమె వివరాలను తమ శాఖ వెబ్ సైట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ దేత్తడి హారిక(అలేఖ్య హారిక)కు ఆ డిపార్ట్‌మెంట్ షాకిచ్చింది. ఆమె వివరాలను తమ శాఖ వెబ్ సైట్ నుంచి మంగళవారం తొలగించింది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నుంచి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామక పత్రాన్ని ఆమె సోమవారం అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాతి రోజే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎంవో అధికారులకు సమాచారమివ్వకుండానే శ్రీనివాస్ గుప్తా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడంతో ఇలా జరిగిందని సంబంధిత శాఖ అధికారులు అంటున్నారు. ఈ మేరకు శ్రీనివాస్ గుప్తాను సీఎంవో అధికారులు మందలించినట్టు తెలిసింది. 


యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హారిక.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఆ షోతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. తెలంగాణ అమ్మాయి కావడంతో టూరిజం అంబాసిడర్‌గా ఆమెను శ్రీనివాస్ గుప్తా నియమించారని సమాచారం. అయితే శాఖా పరమైన అనుమతులు తీసుకోకపోవడంతో తొలగించినట్టు తెలుస్తోంది.    

Updated Date - 2021-03-09T20:50:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising