ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణమాఫీ చేస్తాం: సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2021-03-18T00:02:15+05:30

తాము ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా త్వరలోనే రుణమాఫీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తాము ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా త్వరలోనే రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతుల రుణాల పై వడ్డీని కూడా ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ తెలిపారు. శాసనసభలో కేసీఆర్ మాట్లాడారు. సీఎల్పీ నేత తాను కాంగ్రెస్ పాలన భ్రమలోనే ఉన్నట్లు కలగంటున్నారని భట్టి విక్రమార్క పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగాన్ని వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం భట్టి చేశారని సీఎం విమర్శించారు. గవర్నర్ ప్రసంగం బుక్ పెద్దగా ఉందని భట్టి అన్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వ చేసింది పెద్దగా ఉంది కాబట్టి బుక్ పెద్దగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. 





ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అప్పులు చేసామని, భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తామని ఆయన తెలిపారు. 2014లో 12 లక్షల 23వేల ఎకరాల పంట సాగు ఉంటే ప్రస్తుతం 58లక్షల పంట సాగులో ఉందని సీఎం కేసీఆర్ వివరించారు. పంట సాగులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, తమిళనాడు రెండో స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రెండున్నర రెట్ల సాగు తెలంగాణలో పెరిగిందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ వచ్చాక నీటి పన్నురద్దు చేసామని ఆయన పేర్కొన్నారు.




 నాడు ఉచిత కరెంట్ ఇస్తామని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించారని కానీ ఇవ్వలేదని కేసీఆర్ తెలిపారు. రైతులకు రుణమాఫీ ప్రస్తావణలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అవుతుందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పినా ప్రజలు నమ్మలేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో రుణమాఫీ చేస్తామని చెప్పినా ప్రజలు నమ్మడం లేదన్నారు. 

Updated Date - 2021-03-18T00:02:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising