దళిత బంధును ఆపింది బీజేపీనే
ABN, First Publish Date - 2021-10-21T09:02:04+05:30
దళిత బంధును ఆపింది బీజేపీనే అని, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి ఈ నెల 7న లేఖ రాశారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
ఈ విషయాన్ని నిరూపించడానికి సిద్ధం: హరీశ్‌రావు
జమ్మికుంట రూరల్, అక్టోబరు 20: దళిత బంధును ఆపింది బీజేపీనే అని, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి ఈ నెల 7న లేఖ రాశారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఏ బీజేపీ నేత వచ్చినా ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని సవాల్ విసిరారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో టీఆర్‌ఎస్ అఽభ్యర్థి తరఫున నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ తెచ్చిన పార్టీ అని, కేసీఆర్ కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చారన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్‌ను 2016 చేసింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. దళితబంధు కూడా దళితులందరికీ అందుతుందన్నారు. తన స్వార్థం కోసం ఈటల టీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేశార న్నారు. ఈటల గెలిస్తే బీజేపీకి లాభమని, గెల్లు శ్రీనివాస్ గెలిస్తే ప్రజలకు లాభమని ఆయన చెప్పారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. భూముల పంచాయతీ వల్లనే ఈటల బీజేపీలో చేరారని, అదంతా హుజూరాబాద్ ప్రజల పంచాయతీగా ఆయన మాట్లాడుతున్నారన్నారు.
Updated Date - 2021-10-21T09:02:04+05:30 IST