ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో సైబర్ ల్యాబ్... రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్

ABN, First Publish Date - 2021-07-17T23:23:42+05:30

సైబర్ యోధా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ శనివారం మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్‌కు ‘సైబర్ యోధా’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సైబర్ యోధా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ శనివారం మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్‌కు ‘సైబర్ యోధా’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. 100 మందితో ప్రారంభిచామని, 21 మంది విద్యార్థులు, 30 మంది ఐటీ ఉద్యోగులు, ఆరుగురు రిటైర్డ్ ఉద్యోగులు స్వచ్చందంగా పని చేస్తున్నట్టు తెలిపారు. మహిళలు, చిన్నారులు, సామాన్యులపై  డిజిటల్ మీడియా ద్వారా చేస్తున్న మోసాల పై సైబర్ యోదా పనిచేస్తుంది. వివిధ పోలీస్ స్టేషన్‌లలోని ఫిర్యాదులను సైబర్ యోధా పరిస్కరిస్తుందని కమిషనర్ చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సంధాన కర్తగా సైబర్ యోధా పని చేస్తుందన్నారు. ఆన్ లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారని ఆయన హెచ్చరించారు. టెక్నాలజీని మంచి కన్న చెడు కోసం ఉపయోగించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారన్నారు. సైబర్ ల్యాబ్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-17T23:23:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising