ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు మాజీ న్యాయమూర్తికే టోపీ

ABN, First Publish Date - 2021-07-29T09:29:56+05:30

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తికే టోపీ పెట్టారు సైబర్‌ నేరగాళ్లు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివాసముంటున్న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తివాడ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.45,931 కాజేసిన సైబర్‌ నేరగాళ్లు


బంజారాహిల్స్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తికే టోపీ పెట్టారు సైబర్‌ నేరగాళ్లు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివాసముంటున్న  హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తివాడ రాజగోపాల్‌రెడ్డి ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. కరెంటు బిల్లు చెల్లించని కారణంగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నామని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆయన ఆ మెసేజ్‌లో ఇచ్చిన నంబర్‌కు ఫోన్‌ చేశారు. బిల్లులు కట్టడం లేదని, అందుకే సరఫరాను నిలిపివేస్తు న్నా మని పేర్కొన్నాడు. తాను బిల్లులు చెల్లిస్తున్నానని రాజగోపాల్‌రెడ్డి బదులిచ్చారు. టీమ్‌ వీవర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని దరఖాస్తు పూర్తి చేయాలని అవతలి వ్యక్తి చెప్పాడు. దీంతో రాజగోపాల్‌రెడ్డి వివరాలను కూడా అందులో పొందుపర్చారు. తన ఖాతాలో నుంచి రూ.45,931 డ్రా అయ్యా యని ఆయనకు మెసేజ్‌ వచ్చింది. సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-07-29T09:29:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising