ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉస్మానియాలో రూ.7 కోట్లతో సిటీ స్కాన్‌

ABN, First Publish Date - 2021-12-14T21:02:09+05:30

నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖా మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖా మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.7 కోట్లతో క్యాథ్ లాబ్, సిటీ స్కాన్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు క్యాథ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఉస్మానియాలో శానిటేషన్ కాంట్రాక్ట్‌కు త్వరలోనే టెండర్ పిలుస్తామన్నారు. గుండె జబ్బు ఉన్న పేషేంట్లకు.. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగయిన వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఉస్మానియాలో పని చేయని వెంటిలేటర్లను వెంటనే రిపేర్ చేయాలని ఆదేశాలిచ్చారు.


రాత్రి పూట పోస్ట్‌మార్టం

ఉస్మానియాలో 5 కోట్ల రూపాయలతో అధునాతన మార్చురీ ఏర్పాటు చేస్తామన్నారు. రాత్రి పూట పోస్ట్ మార్టం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ సేవలను పెంచాలని అధికారులకు సూచించారు. టెస్టింగ్‌ల కోసం రోజుల తరబడి వెయిట్ చెయ్యాల్సిన పరిస్థితి లేకుండా చూడాలన్నారు. ఉస్మానియాకు nabc అక్రిడేషన్ కోసం వెళ్తున్నామన్నారు. ఉస్మానియా పాత భవనం కోర్టు కేసు పూర్తవగానే త్వరగా కొత్త భవనాన్ని నిర్మిస్తామన్నారు. 




Updated Date - 2021-12-14T21:02:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising