ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎస్

ABN, First Publish Date - 2021-11-20T00:10:57+05:30

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి భువనగరి: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు పరిశీలించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా,  ఆలయ చైర్మన్ బి.నర్సింహామూర్తి లడ్డూ ప్రసాదం అందజేశారు. 


అంతకు ముందు సీఎస్ కు ఆలయ మర్యాదలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి,  ఆలయ ఈవో ఎన్ గీత, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, తదితరులు వెంట ఉన్నారు.

Updated Date - 2021-11-20T00:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising