ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు భూముల సమస్య పరిష్కారానికి కలెక్టర్‌లు చొరవ తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-11-06T01:59:17+05:30

తెలంగాణలో పోడు భూముల సమస్య పరిష్కరానికి జిల్లాకలెక్టర్లు, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో పోడు భూముల సమస్య పరిష్కరానికి జిల్లాకలెక్టర్లు, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్లు, డిఎఫ్ఓలు, అడిషనల్ కలెక్టర్లు, డిపివోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోడు భూముల సమస్య పరిష్కరానికి గ్రామ పంచాయితీ, మండల, డివిజన్, జిల్లా స్ధాయిలో ఎఫ్ఆర్ సి లతో సమన్వయం చేస్తూ ప్రత్యేక టీమ్స్ ఏర్పాటుచేయాలన్నారు. గ్రామస్ధాయిలో గిరిజనులకు అవసరమైన అవగాహన కల్పించాలన్నారు. అధికారులు అవసరమైన మేరకు ఫామ్:ఏ కాపీలను అందుబాటులో ఉంచాలన్నారు. దీని ద్వరా గ్రామస్తుల నుంచి వినతులను స్వీకరించాలని అన్నారు.


పూర్తి చేసిన ఫారాలను కూడా నిర్ణీత సమయంలో కలెక్ట్ చేసుకోవాలన్నారు. నవంబరు 8 నుంచి ఫామ్:ఏ వినతులను స్వీకరించాలని ఆదేశించారు. అలాగే పోడు భూములకు సంబంధించి సమగ్రమైన మార్గదర్శకాలను కూడా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. క్లెయిమ్ ఫారాల విషయంలో కలెక్టర్లు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామ పంచాయితీ టీమ్స్ ఎఫ్ ఆర్ సిలతో కలిసి బస్తీస్థాయిలో కలెక్ట్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫారెస్ట్ శాంత కుమారి, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్.శోభ, స్టాంప్ప్ అండ్ రిజిస్ర్టేషన్ కమిషనర్ శేషాద్రి, పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-06T01:59:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising