ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ-శ్రమ్ పోర్టల్ లోకి అసంఘటిత కార్మికుల డేటా

ABN, First Publish Date - 2021-11-04T01:55:07+05:30

అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరిని 2021 డిసెంబర్ 31వ తేదీ నాటికి ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరిని 2021 డిసెంబర్ 31వ తేదీ  నాటికి ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో కార్మిక, సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా నమోదు  ప్రక్రియను సమీక్షించారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు కార్మికులను సిటిజన్ సర్వీస్‌ సెంటర్లకు తరలించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి రిజిస్ట్రేషన్‌లను వేగవంతం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. 


జిల్లా, గ్రామం, వార్డు స్థాయిలో వర్కర్ ఫెసిలిటేషన్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలని, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సంబంధిత శాఖాధికారుల పర్యవేక్షణలో నమోదు పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. జిల్లా స్థాయి కమిటీలు లక్ష్యసాధనకై రాష్ట్ర స్థాయి నోడల్ అధికారులు అన్ని శాఖలతో సమన్వయం చేయాలని ఆదేశించారు. ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదుపై అవగాహన శిబిరాలు నిర్వహించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగాల కార్మికులకు కల్పిస్తున్న ప్రయోజనాలను వివరించాలని అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ-శ్రమ్ పథకం కింద అసంఘటిత రంగాల కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు, వికలాంగులైతే లక్ష రూపాయలు చెల్లిస్తారన్నారు.


సీఎస్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీని, జిల్లా కలెక్టర్లు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కార్మిక శాఖ అధికారులను సీఎస్  ఆదేశించారు.ఈ సమావేశంలో ఉపాది శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా,వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు , శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డి. దివ్య, జి.హెచ్.ఎం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, కార్మిక శాఖ కమీషనర్ అహ్మద్ నదీమ్, సిడిఎంఏ సత్యనారాయణ, పీఆర్ అండ్ ఆర్ డి కమీషనర్ శరత్, టిఎస్ టిఎస్ ఎండి వెంకటేశ్వర్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-04T01:55:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising