ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షాలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: సీఎస్‌

ABN, First Publish Date - 2021-08-30T22:41:51+05:30

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. ఈమేరకు సోమవారం ఆయన వివిధ జిల్లాల ఉన్నతాధికారులతో డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మంతో పాటు మిగిలిన అన్నిజిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, కమిషనర్‌్‌స ,నీటి పారుదల చీఫ్‌ ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 


తెలంగాణలో వర్షాల కారణంగా ఎలాంటి విపత్తు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధికార యంత్రాంగాన్నిఅప్రమత్తంగా ఉడాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈనేపధ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. విద్యుత్‌ శాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. 


క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు హెడ్‌క్వార్టర్స్‌తో సమన్వయంతో ఉండాలన్నారు. అన్నిజిల్లాల కలెక్టర్లు కూడా తమ జిల్లాస్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి అప్రమత్తం చేయాలని వారిని ఆదేశించారు. ఈసమావేశంలో స్పెషల్‌ చీఫ్‌  సెక్రటరీ సునీల్‌శర్మ, రజత్‌ కుమార్‌, డీజీ ఫైర్‌ సర్వీసెస్‌ సంజయ్‌ కుమార్‌జైన్‌, పంచాయితీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శిరిజ్వీ,ముఖ్యమంత్రి కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, జీహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-30T22:41:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising