ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెస్ట్ కాలనీగా తునికి బొల్లారం R & R కాలనీ : సోమేష్ కుమార్

ABN, First Publish Date - 2021-06-14T22:06:50+05:30

దేశంలోనే బెస్ట్ కాలనీగా తునికి బొల్లారం R & R కాలనీని తీర్చిదిద్దామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: దేశంలోనే బెస్ట్ కాలనీగా తునికి బొల్లారం R & R కాలనీని తీర్చిదిద్దామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. కొండపోచమ్మ సాగర్ జలాశయం నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన తునికి బొల్లారం R & R కాలనీని కలెక్టర్ వెంకట్రాం రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. తునికి బొల్లారం R & R కాలనీ వివరాలను సీఎస్ సోమేష్ కుమార్‌కు కలెక్టర్ వెంకట్రాం రెడ్డి వివరించారు. అనంతరం నిర్వాసితులతో  సీఎస్ మాట్లాడారు. R & R కాలనీ చాలా బాగా వచ్చిందని సీఎస్ అన్నారు. 


కాలనీ లే అవుట్, అంతర్గత రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని ఆయన  పేర్కొన్నారు. దీంతో దేశంలోనే బెస్ట్ కాలనీగా తునికి బొల్లారం R & R కాలనీగా ఉందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో నిర్వాసితులకు బెస్ట్ కాలనీని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ తమకు హామీ ఇచ్చి నెరవేర్చారని ఈ సందర్భంగా నిర్వాసితులు తెలిపారు. హామీ ఇచ్చిన మేరకు అన్ని వసతులతో కాలనీ నిర్మాణం చేసి తమకు అందజేశారని సీఎస్ సోమేష్ కుమార్‌కు నిర్వాసితులు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-14T22:06:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising