ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో డోస్ వాక్సిన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి-సీఎస్

ABN, First Publish Date - 2021-10-30T20:54:14+05:30

గ్రేటర్ హైదరాబాద్ లో శనివారం నుండి ప్రారంభించిన రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో శనివారం నుండి ప్రారంభించిన రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. శనివారం నగరంలోని రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని సన్ రైజ్ హోమ్ కాలనీలో ఏర్పాటుచేసిన మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ లు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే మూడు కోట్లకు పైగా కోవిద్ వ్యాక్సిన్ లను అందచేశామని తెలిపారు. కరోనా నివారణకు కేవలం వ్యాక్సిన్ తీసుకోవడమే మార్గమని పేర్కొన్నారు. 


హైదారాబాద్ నగరంలో దాదాపు తొంబ్బై శాతం పౌరులకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని, నేటి నుండి పది రోజులపాటు ఏర్పాటు చేసిన 150  మొబైల్  వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా రెండో డోస్ ను వేయడం జరుగుతుందని వైద్య శాఖ కార్యదర్శి రిజ్వీ వివరించారు. నగరంలో రెండు మూడు కాలనీలకు ఒక ప్రత్యేక కేంద్రం వద్ద ఈ మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా రెండో డోస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ వివరించారు. ప్రతీ రోజూ దాదాపు 450 కాలనీలను కవర్ చేస్తామని అన్నారు. అవసరమైతే వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరిన్ని రోజులు పొడగించనున్నట్టు లోకేష్ కుమార్ వివరించారు.

Updated Date - 2021-10-30T20:54:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising